సంజనకు సిల్వర్ మెడల్..!
November 16, 2026
dharshininews
సంజనకు సిల్వర్ మెడల్..!
- పదో తరగతిలో సెకండ్ టాపర్‌గా నిలిచిన విద్యార్థినికి పురస్కారం
- గంగా అరుణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ డే వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా గంగా అరుణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీజీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఆఫ్ మెరిట్ ప్రదానోత్సవంలో పదో తరగతిలో సెకండ్ టాపర్‌గా నిలిచిన ఎల్. సంజనకు సిల్వర్ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గుర్తించి, ఇలాంటి పురస్కారాలతో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ఈ అవార్డులు విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని, చదువుపై ఆసక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థులు విద్యారంగంలో మరిన్ని విజయాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, గంగా అరుణ ఫౌండేషన్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45417/