schedule Monday, November 16, 2026

నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..!

calendar_today November 16, 2026
person dharshininews
నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..!
నీటి కష్టాలకు ముందస్తు కళ్లెం..! - తాండూరులో తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి - రూ.5 లక్షలతో తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ చర్యలు - మరో రూ.10 లక్షలతో హైమాస్ట్ లైట్ల మరమ్మతులు - తాండూరు స్వచ్ఛత కోసం రూ.10.82 లక్షల ప్రణాళిక - సాదాసీదాగా ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి: వేసవి నేపథ్యంలో పట్టణంలో తాగునీటి ఎద్దడికి కళ్లెం వేసేందుకు తాండూరు మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.5 లక్షల నిధులతో ప్రైవేట్ ట్యాంకర్లను అద్దెకు తీసుకుని అవసరమైన వార్డులకు నీటిని సరఫరా చేయాలని తీర్మానించారు. మొత్తం ఎనిమిది అంశాలతో కూడిన కౌన్సిల్ ఎజెండాలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న హైమాస్ట్ లైట్ల మరమ్మతుల కోసం రూ.10 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ.10.82 లక్షలతో ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వాల్ పెయింటింగ్‌లు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. వీటితో పాటు పట్టణంలోని వీధి కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించడం, పండుగల నిర్వహణ తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల మెరుగుదలపై కౌన్సిల్ దృష్టి సారించింది. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్లు నాగారం మల్లేశం, మోయిజ్, కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఘనంగా లక్ష్మీపూజ, దీపావళి.. మరోవైపు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో లక్ష్మీపూజ, దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి యేడాది దీపావళి సందర్భంగా కార్యాలయంలో లక్ష్మీ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కార్యాలయంలో లక్ష్మీపూజ నిర్వహించారు. దీపావళీ, కార్తీక సోమవారంను పురస్కరించుకుని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పూజలను నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో కౌన్సిలర్లు, అధికారులతో కలిసి దీపావళీ సంబరాలను జరుపుకున్నార. కాకర పువ్వోత్తులను కాలుస్తూ సందడి చేశారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీలతీతంగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు దక్కేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు అందరు సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/45411/