జావిద్ బాయ్‌కి జేజేలు..!
November 16, 2026
dharshininews
జావిద్ బాయ్‌కి జేజేలు..!
- సన్మానించిన కాలనీ ప్రజలు
- వార్డు ప్రజల సేవే ధ్యేయం
- రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి రాజీవ్, ఇందిరమ్మ కాలనీల బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ భాయ్‌కి కాలనీ ప్రజలు జేజేలు పలికారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత ఫించన్ పథకంలో వార్డుకు చెందిన 95 మంది దరఖాస్తు చేసుకోగా.. తాండూరు పట్టణంలోనే అత్యధికంగా 82 మందికి ఫించన్ మంజూరయ్యింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో లబ్దిదారులు మంజూరు పత్రాలను అందుకున్నారు.
ఇందులో భాగంగా కాలనీ ప్రజలు కౌన్సిలర్ జావిద్‌ను ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్‌గా తమకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా కృషి చేస్తున్నారని కొనియాడారు.
అనంతరం కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు. 95 మందిలో మిగతా వారికి కూడా ఫించన్ మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. కాలనీల అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని అన్నారు. కాలనీ ప్రజల అభిమానం ఎప్పటికి మరువలేనని అన్నారు.
https://www.dharshininews.com/45409/