schedule Monday, November 16, 2026

ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..!

calendar_today November 16, 2026
person dharshininews
ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..!
ప్రజా సమస్యల చర్చకు సమయం కరువు..! - అర్థంతరంగా కౌన్సిల్ సమావేశం ముగింపు - హైమాస్ట్ లైట్లు, స్వచ్ఛత నిధుల కేటాయింపుపై డీసెంట్ నోట్ - మాజీ వైస్ చైర్‌ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వార్డుల్లో సమస్యలు పేరుకుపోతుంటే వాటిని కౌన్సిల్‌లో ప్రస్తావించేందుకు కూడా సమయం ఇవ్వలేదని మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని అర్థంతరంగా ముగించాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు. సోమవారం చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి హాజరైన ఆమె, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మొత్తం ఎనిమిది అంశాలతో ఎజెండా ప్రవేశపెట్టగా, నాలుగు, ఐదో అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీసెంట్ నోట్ ఇచ్చినట్లు దీపా నర్సింలు తెలిపారు. గతంలోనే వార్డుల్లో కొత్త హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ.22 లక్షలు కేటాయించారని, ఇప్పుడు మరమ్మతుల పేరుతో మరో రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేటాయింపుపై తమ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేసినట్లు వెల్లడించారు. తాండూరు పట్టణ స్వచ్ఛత కార్యక్రమం కోసం రూ.10.82 లక్షలు కేటాయించడంపైనా అభ్యంతరం తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తారు? పనులు చేపట్టే కాంట్రాక్టర్ ఎవరు? అనే వివరాలు వెల్లడించలేదని ప్రశ్నించారు. అమృత్ 2.0 కింద నిధులు వినియోగిస్తామని కమిషనర్ వివరించినప్పటికీ, తమకు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన సమయంలో దీపావళి, లక్ష్మీపూజతో పాటు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో చర్చకు తగిన సమయం లేకుండా పోయిందని దీపా నర్సింలు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సమావేశాన్ని ముగించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాగలక్ష్మి, రూప రుద్రుపాటిల్, నవీన సంతోష్ గౌడ్, జావిద్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45413/