schedule Monday, November 16, 2026

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..!

calendar_today November 16, 2026
person dharshininews
ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..!
ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం..! - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - రెండు గృహప్రవేశ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన కట్కం జయశ్రీ వెంకటేష్, 10వ వార్డుకు చెందిన వెంకటలక్ష్మి ఎల్లేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించడంతో పాటు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నూతన గృహాల్లో అడుగుపెడుతున్న కుటుంబాల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తయాబా సుల్తానా, అల్లాపురం శ్రీకాంత్, ఇతర వార్డుల కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45415/