పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!
November 15, 2026
dharshininews
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!
- అర్హులందరికి చేయూత ఫించన్లు
- ఎమ్మెల్యే కృషితో 1200 మందికి మంజూరు
- రేపు తాండూరు మున్సిపల్‌లో పత్రాల పంపిణీ
- కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు.
ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం కింద రేపు సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అర్హులకు ఫించన్ మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, పింఛన్లు ఇచ్చిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కొనియాడారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తాండూరు మున్సిపల్‌కు 36వార్డుల్లో 1200ల మందికి చేయూత ఫించన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. పట్టణంలోని 24వ వార్డులో 26 మందికి ఫించన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలవుతున్నాయని అన్నారు.
తాజాగా చేయూత ఫించన్లతో వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఎంతో భరోసా కలగబోతుందని అన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత ఫించన్లు వంటి పథకాలు అమలు చేయడంలో తాండూరు నెంబర్ 1గా నిలుస్తుందని అన్నారు. అర్హులైన ఫించన్ లబ్దిదారులు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మంజూరు పత్రాలను పొందాలని విజ్ఞప్తి చేశారు.
https://www.dharshininews.com/45397/