తాండూరులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్..!
November 14, 2026
dharshininews
తాండూరులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్..!
- అడుగడుగునా ఘన స్వాగతం, పూల వర్షం
- క్రమశిక్షణతో కదం తొక్కిన స్వయంసేవకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పథసంచలన్ ఉద్వేగ భరితంగా జరిగింది.
క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచేలా స్వయంసేవకులు బృందాలుగా కదం తొక్కుతూ పట్టణ ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణ పుర వీధుల్లో సమన్వయంతో సాగిన ఈ పథసంచలన్ పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
పథసంచలన్ సాగిన మార్గంలో పలుచోట్ల స్థానికులు పూలవర్షం కురిపిస్తూ స్వయంసేవకులకు స్వాగతం పలికారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, సమితి ప్రతినిధులు పర్యాద రామకృష్ణ, వికాస్ జోషి తదితరులు పాల్గొని స్వయంసేవకులపై పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు.
క్రమశిక్షణ, ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా సాగిన పథసంచలన్‌తో పట్టణంలో సందడి నెలకొంది. అడుగడుగునా లభించిన స్వాగతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
https://www.dharshininews.com/45390/