ఢిల్లీకి బయల్దేరిన శంకరన్న..!
November 14, 2026
dharshininews
ఢిల్లీకి బయల్దేరిన శంకరన్న..!
- రేపు అంతర్జాతీయ సేవారత్న అవార్డు ప్రధానం
- రాజ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, డా. విజయ్ తో కలిసి న్యూఢిల్లీకి పయనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు శనివారం ఉదయం ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరారు.
గత 15 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవకు అంకితమైన శంకర్ యాదవ్‌కు ఈ గుర్తింపు దక్కడం విశేషం. ఆయనతో పాటు బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు పి. వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కుర్వా విజయ్ కుమార్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు.
ఆదివారం న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో గల గడ్వాల్ భవన్‌లో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వివిధ శాఖల ప్రముఖుల చేతుల మీదుగా శంకర్ యాదవ్‌కు అంతర్జాతీయ సేవారత్న అవార్డును ప్రదానం చేయనున్నారు.
తాండూరుకు చెందిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో పట్టణ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ యాదవ్‌కు అభినందనలు తెలుపుతూ, అవార్డు ప్రదానోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
https://www.dharshininews.com/45380/