జీవో 25 సవరించాలి..!
November 14, 2026
dharshininews
జీవో 25 సవరించాలి..!
- ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు పంపొద్దు
- ప్రాథమిక విద్యను బలోపేతం చేసేలా నిబంధనలు మార్చాలి
- పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల శాఖ అధ్యక్షుడు వెంకటయ్య
- ప్రధాన కార్యదర్శి పరమేష్
యాలాల, దర్శిని ప్రతినిధి: జీవో నంబర్ 25లో పేర్కొన్న ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల శాఖ అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేష్ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులను దూర మండలాలకు పంపించే చర్యలు ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలని, 40 మంది విద్యార్థులున్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులను, 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.
ఆన్‌లైన్ బదిలీల ద్వారా ఖాళీ పోస్టులకు వచ్చి విధుల్లో చేరిన ఉపాధ్యాయులను మళ్లీ ఇతర మండలాలకు పంపించడం అన్యాయమని పేర్కొన్నారు. విధుల్లో చేరిన తర్వాత యూడైస్ ప్లస్ నుంచి తొలగించడం, ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ముఖ్యంగా యాలాల మండలం నుంచి దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు ఉపాధ్యాయులను పంపించే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే బోధన, బోధనేతర పనుల ఒత్తిడితో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, దూర ప్రాంతాలకు పంపితే విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం జీవో 25ను సవరించి, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాథమిక విద్యను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
https://www.dharshininews.com/45382/