schedule Friday, November 13, 2026

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..!

calendar_today November 13, 2026
person dharshininews
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..!
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం..! - విలేకరుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కార్యవర్గానికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే–ఐజేయూ నూతన కార్యవర్గంలో కోశాధికారిగా ఎన్నికైన పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నర్సింలు (సాక్షి), కార్యవర్గ సభ్యులు రాంచందర్, వెంకటేశం, నర్సింలు (ఏబీఎన్), బాబర్, శాంతు తదితరులను గురువారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య ఎదురైనా, ఆపద వచ్చినా పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతో జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కరణం పురుషోత్తంరావు, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్‌పర్సన్ మధులత శ్రీనివాస్ చారి, టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, తాండూరు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45373/