ఇక పింఛను ఆగదు..!
November 13, 2026
dharshininews
ఇక పింఛను ఆగదు..!
- భర్త మరణిస్తే భార్యకు తక్షణమే అమలు
- చేయూత పింఛనుదారులకు ప్రభుత్వం ఊరట
- అన్ని కేటగిరీలకూ వర్తింపు..
- దరఖాస్తు విధానాలు తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: చేయూత పింఛను పొందుతున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. పింఛనుదారు మరణించినప్పుడు ఆయన భార్యకు ఆర్థిక సహాయం అందడంలో జరుగుతున్న జాప్యానికి పరిష్కారం చూపింది.
ఇకపై పింఛనుదారు మరణిస్తే అర్హతను బట్టి భార్యకు వెంటనే పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. గతంలో ఈ వెసులుబాటు వృద్ధాప్య పింఛనుదారుల కుటుంబాలకే పరిమితమైంది. తాజాగా దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల పింఛన్లకు కూడా ఈ విధానాన్ని విస్తరించారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వయస్సును బట్టి పింఛను కేటాయింపు
పింఛనుదారు మరణించే సమయానికి భార్య వయస్సు 57 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వితంతు పింఛను కింద, 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛను కింద ఆర్థిక సహాయం అందిస్తారు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
అర్హులైన మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి. ఇందుకోసం ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, మరణించిన భర్త ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతులను అందించాలి.
ఈ నిర్ణయంతో చేయూత పింఛనుదారులను కోల్పోయిన మహిళలు పింఛను కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితికి పరిష్కారం లభించనుంది. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి ప్రభుత్వం నుంచి భరోసా అందనుంది.
https://www.dharshininews.com/45367/