సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!
November 12, 2026
dharshininews
సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!
- యూఫోరియా వేడుకల సందడి
- ఆటపాటలతో హోరెత్తించిన విద్యార్థులు
- విద్యార్థులలో స్పూర్తిని నింపిన రంగారావు, విజయదేవి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆటపాటలతో తాండూరులోని సింధు డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
గురువారం తులసి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో “సింధుస్ యూఫోరియా–2026” పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల వ్యవస్థాపకులు, అధ్యక్షులు వి. రంగారావు, ప్రిన్సిపాల్ ఎస్. విజయదేవి, వైస్ ప్రిన్సిపాల్ పి. అమరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలని అధ్యక్షులు వి. రంగారావు సూచించారు. క్రమశిక్షణ, సమయపాలనతో ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేయాలని ప్రిన్సిపాల్ ఎస్. విజయదేవి అన్నారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని వైస్ ప్రిన్సిపాల్ పి. అమరేందర్ రెడ్డి సూచించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, స్కిట్లు ఆకట్టుకున్నాయి. సీనియర్ విద్యార్థులు జూనియర్లతో కలసి సందడి చేస్తూ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. విద్యార్థుల కళాత్మక ప్రదర్శనలు, సమిష్టి భాగస్వామ్యంతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45361/