schedule Thursday, November 12, 2026

గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..!

calendar_today November 12, 2026
person dharshininews
గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..!
గొట్టిగా మహిపాల్‌రెడ్డి యాదిలో..! - కొటబాసపల్లిలో ఘనంగా 16వ వర్ధంతి - తండ్రి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన గొట్టిగా నరసింహారెడ్డి (బాబు) తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాజీ ఎంపీపీ, స్వర్గీయ గొట్టిగా మహిపాల్‌రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం తాండూరు మండలం కోటబాసుపల్లి గ్రామంలోని స్మృతివనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గొట్టిగా నరసింహారెడ్డి (బాబు) స్మృతివనంలో ఉన్న తండ్రి సమాధి వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు నాయకులు, గ్రామస్తులు కూడా పాల్గొని నివాళులు అర్పించారు. https://www.dharshininews.com/45352/