బావనోళ్ల శంకర్ యాదవ్‌కు సేవారత్న అంతర్జాతీయ అవార్డు..!
November 11, 2026
dharshininews
బావనోళ్ల శంకర్ యాదవ్‌కు సేవారత్న అంతర్జాతీయ అవార్డు..!
- 15 ఏళ్లుగా సామాజిక సేవలో విశిష్ట కృషికి పురస్కారం
- ఈనెల 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవా రంగంలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బి. శంకర్ యాదవ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
గత 15 ఏళ్లుగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో తనవంతు కృషి చేస్తున్న ఆయనను బహుజన సాహిత్య అకాడమీ ప్రతిష్ఠాత్మకమైన సేవారత్న అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రతి సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవారత్న అవార్డులను ప్రదానం చేస్తున్న బహుజన సాహిత్య అకాడమీ.. ఈ ఏడాది శంకర్ యాదవ్‌కు ఈ గౌరవాన్ని అందించనుంది.
ఈనెల 15న న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో నిర్వహించనున్న బహుజన రైటర్స్ 20వ జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సంక్షేమ శాఖ మంత్రి రవీంద్ర ఇంద్రాజ్ సింగ్, భారత ప్రభుత్వ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సుధా రాణి రిలంగి, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ప్రత్యేక ఆహ్వానిత అతిథిగా శంకర్ యాదవ్ పాల్గొననున్నారు. తాండూరుకు చెందిన శంకర్ యాదవ్ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక కావడంపై స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
https://www.dharshininews.com/45340/