schedule Wednesday, November 11, 2026

జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి

calendar_today November 11, 2026
person dharshininews
జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి
జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పవన్ కుమార్‌రెడ్డి ఏకగ్రీవం  - సన్మానించిన తాండూరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తాండూరు, దర్శిని ప్రతినిధి: టీయూడబ్లూజే వికారాబాద్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా జి. పవన్ కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాండూరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ మూడో జిల్లా మహాసభల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కుమార్‌రెడ్డిని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే తాండూరు యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు పవన్ కుమార్‌రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. https://www.dharshininews.com/45338/