schedule Monday, November 09, 2026

అయ్యప్ప స్వాముల శబరిమల బాట..!

calendar_today November 9, 2026
person dharshininews
అయ్యప్ప స్వాముల శబరిమల బాట..!
అయ్యప్ప స్వాముల శబరిమల బాట..! - మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామి శరణుఘోషతో తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సోమవారం తాండూరుకు చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు మహా పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్ర విజయవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆకాంక్షించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. యాత్ర ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా అయ్యప్ప స్వాములతో కలిసి కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు. స్వాములకు శుభాకాంక్షలు తెలిపి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, నాయకులు డా.సంపత్ కుమార్, రాజుగౌడ్, కౌన్సిలర్లు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45319/