schedule Monday, November 09, 2026

శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..!

calendar_today November 9, 2026
person dharshininews
శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..!
శభాష్‌.. సాయివర్ధన్ గౌడ్..! - మూడోసారి శబరిమల మహాపాదయాత్రకు - అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ సీనీయర్ నాయకులు హరిహరగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు, మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్‌ల కుమారుడు సాయివర్ధన్ గౌడ్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శభాష్ అంటూ అభినందించారు. తాండూరు నుంచి శబరిమల మహాపాదయాత్రకు సాయివర్ధన్ గౌడ్ సోమవారం మూడోసారి బయల్దేరి వెళ్లారు. తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుమారు 45 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వాముల పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో తాండూరు నుంచి హరిహరగౌడ్, సరితాహరిగౌడ్‌ల కుమారుడు సాయివర్ధన్‌ గౌడ్ మూడోసారి శబరిమలకు వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాయివర్ధన్‌ గౌడ్‌ను శభాష్ అంటూ అభినందించారు. తాండూరు నుంచి బయల్దేరుతున్న స్వాముల పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అయ్యప్ప స్వాములు, కుటుంభ సభ్యులు, భక్తులు ఉన్నారు. https://www.dharshininews.com/45315/