schedule Monday, November 09, 2026

నిద్రమత్తులో డ్రైవింగ్..!

calendar_today November 9, 2026
person dharshininews
నిద్రమత్తులో డ్రైవింగ్..!
నిద్రమత్తులో డ్రైవింగ్..! - ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ - తప్పిన ప్రమాదం.. తాండూరులో తెల్లవారుజామున ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: డ్రైవర్‌ నిద్రమత్తు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా తాండూరు పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో డీసీఎం, లారీ వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాన్ని అదుపు చేయలేక ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. https://www.dharshininews.com/45311/