అయ్యప్ప స్వాములకు సేవలో..!
November 10, 2026
dharshininews
అయ్యప్ప స్వాములకు సేవలో..!
- కోస్గిలో పండ్లు, ఫలహారాల పంపిణీ
- తాండూరు వ్యాపారి, నేతల ఉదారత
తాండూరు, దర్శిని ప్రతినిధి: శబరిమల యాత్రలో ఉన్న అయ్యప్ప స్వాములకు భక్తితో సేవలో తాండూరుకు చెందిన నేతలు, వ్యాపారి తరించారు.
సువర్ణభూమి సంస్థ ఆధ్వర్యంలో 55 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు శబరిమల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో బుధవారం కోస్గిలో విశ్రాంతి తీసుకుంటున్న స్వాములకు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తాన్ పండ్లు, ఫలహారాలు, మంచినీటిని పంపిణీ చేశారు.
అయ్యప్ప స్వాములకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్వాముల పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దండోతి సంజు కుమార్, భగవాన్, అశోక్ మంథన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45327/