వాహనదారులకు భారీ ఊరట..!
November 11, 2026
dharshininews
వాహనదారులకు భారీ ఊరట..!
- ఇంటి నుంచే మూడు కీలక సేవలు
- ఆర్టీఏ చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్ సర్వీస్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వాహనదారులకు రవాణా శాఖ కీలక వెసులుబాటు కల్పించింది. వాహనాలకు సంబంధించిన మూడు ప్రధాన సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై వాహన యాజమాన్య బదిలీ, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), ఈ-కేవైసీ వివరాల నవీకరణ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. వాహన్ పౌర సేవల పోర్టల్ ద్వారా ఇంటి నుంచే ఈ ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.
వాహనాన్ని ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినప్పుడు యాజమాన్య బదిలీ కోసం విక్రేత, కొనుగోలుదారు తమ వివరాలను విడివిడిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆధార్ ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. నిర్ణీత రుసుము చెల్లించి అవసరమైన వివరాలను సమర్పించవచ్చు. ప్రక్రియ పూర్తయిన అనంతరం కొత్త రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం జారీ చేస్తారు.
అలాగే వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే సందర్భంలో అవసరమైన నిరభ్యంతర పత్రం కోసం కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాహనంపై పోలీసు కేసులు, ఇతర నేర సంబంధిత రికార్డులు ఉన్నాయా అనే వివరాలను సంబంధిత వ్యవస్థల ద్వారా పరిశీలిస్తారు. వాహన యజమానుల వివరాలను నవీకరించుకునేందుకు ఈ-కేవైసీ సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సేవలను వినియోగించుకునే వారు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. ఓటీపీని ఇతరులతో పంచుకోకుండా అధికారిక వాహన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆన్‌లైన్ విధానంతో వాహనదారులకు సమయం ఆదా కావడంతో పాటు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గనున్నాయి.
https://www.dharshininews.com/45334/