ఆర్టీసీలో ప్రతి సండే ఫ్రీ జర్నీ...!
November 14, 2026
dharshininews
ఆర్టీసీలో ప్రతి సండే ఫ్రీ జర్నీ...!
- మంత్లీ సీజన్ టికెట్‌తో ప్రత్యేక ఆఫర్లు
- ప్రకటించిన తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందిస్తోంది. మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) తీసుకున్న వారికి నిబంధనల ప్రకారం ప్రతి సండే ఫ్రీ జర్ని అవకాశం కల్పిస్తున్నట్లు తాండూరు డీపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఆర్టీసీలో అమలు చేస్తున్న మంత్లీ సీజన్ టికెట్ ద్వారా ప్రయాణికుల కోసం ప్రత్యేక రాయితీలు, అదనపు సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. ఎంఎస్‌టీ టికెట్లను దూర పరిమితి లేకుండా జారీ చేయడంతో పాటు టోల్ ఛార్జీలపై రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
ఎంపిక చేసిన నగరాల్లో ఆదివారం ఉచిత ప్రయాణ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, కేవలం రూ.20తో కాంబి టికెట్ పొందవచ్చని వివరించారు. ఇక సూపర్ లగ్జరీ, ఆపై కేటగిరీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల పాస్ తీసుకునేవారికి అదనంగా 5 రోజులు, మూడు నెలల పాస్‌పై 10 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలకు టోల్ ఛార్జీల్లో ప్రత్యేక రాయితీ కూడా ఉందన్నారు.
ఈ సదుపాయాలు నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు మంత్లీ సీజన్ టికెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం తాండూరు ఆర్టీసీ డిపోను సంప్రదించాలని కోరారు.
https://www.dharshininews.com/45386/