ధారూర్ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!
November 15, 2026
dharshininews
ధారూర్ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!
- భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు
- తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ధారూర్ జాతరకు వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం తాండూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ధారూర్‌లో జరిగే జాతరకు తాండూరుతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివెళుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీపో మేనేజర్ వెల్లడించారు.
అందుకనే తాండూరు డీపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పిస్తున్నట్లు వివరించారు. జాతరకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణాలు చేయకుండా, సురక్షితమైన ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
https://www.dharshininews.com/45395/