schedule Sunday, November 15, 2026

రేపు చేయూత ఫించన్‌ పత్రాల పంపిణీ

calendar_today November 15, 2026
person dharshininews
రేపు చేయూత ఫించన్‌ పత్రాల పంపిణీ
రేపు చేయూత ఫించన్‌ పత్రాల పంపిణీ - ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌ల ద్వారా అందజేత - కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత ఫించన్ల పథకానికి సంబంధించిన అర్హులనే రేపు మంజూరు పత్రాల పంపిణీ చేయడం జరుగుతుందని తాండూరు కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డిల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తమ 20వ వార్డులో చేయూత ఫించన్‌ పథకానికి సుమారు 31 మందికి ఎంపిక చేయడం జరిగిందని, అర్హుల ఎంపికకు సహాకారం అందించడంతో పాటు చేయూత ఫించన్‌ ద్వారా భరోసా అందిస్తున్న ఎమ్మెల్యే, చైర్ పర్సన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్డులోని లబ్దిదారులతో పాటు పట్టణంలోని అన్ని వార్డుల అర్హులు హాజరై ఫించన్ పత్రాలను పొందాలని సూచించారు. https://www.dharshininews.com/45392/