schedule Sunday, November 15, 2026

సేవ చేయడం నా బాధ్యత..!

calendar_today November 15, 2026
person dharshininews
సేవ చేయడం నా బాధ్యత..!
సేవ చేయడం నా బాధ్యత..! - తాండూరులో పుట్టడం నా అదృష్టం - ఢిల్లీలో ‘సేవారత్న ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకోవడం గర్వం - సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: భగవంతుడు నన్ను తాండూరు ప్రాంతంలో జన్మింపజేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఈ ప్రాంత ప్రజలకు గత పదిహేను సంవత్సరాలుగా నా వంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం నాకు ఎంతో తృప్తినిస్తోంది. ఇప్పుడు న్యూఢిల్లీ వేదికపై అంతర్జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని గౌరవం' అని తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్రా హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ అన్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆయనకు ప్రముఖుల సమక్షంలో ప్రతిష్ఠాత్మక ‘సేవారత్న ఇంటర్నేషనల్ అవార్డు’ను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తాండూరు ప్రాంత ప్రజలకు నా వంతుగా సహాయం చేస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయి అవార్డుకు నన్ను ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ అవార్డు నాకు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. అదే సమయంలో సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. తాండూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఢిల్లీ వేదికపై ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత బాధ్యతతో, అంకితభావంతో సేవలందించేందుకు కృషి చేస్తానని, సేవ చేయడం నా బాధ్యత” అని శంకర్ యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు ఆయనతో పాటు ఢిల్లీ వెళ్లిన బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, సీనీయర్ జర్నలిస్టు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, డా. విజయ్‌లు శంకర్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. https://www.dharshininews.com/45399/