సంక్షేమంలో చేయూతకు ప్రాధాన్యం..!
November 16, 2026
dharshininews
సంక్షేమంలో చేయూతకు ప్రాధాన్యం..!
- సర్కారుపై ఆర్థిక భారం ఉన్నా పేదలకు అండ
- అర్హులందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం
- తాండూరు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- మున్సిపల్‌లో 1,087 మందికి పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల కోసం కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమంలో చేయూత ఫించన్ పథకానికి పెద్దపీట వేస్తోందని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ అర్హులకు చేయూత ఫించన్ అందిస్తూ అండగా నిలుస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,087 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా ఆపద ఎదురైతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. తాండూరులో నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయంగా త్వరలో కాగ్నా నది నీటిని తీసుకొచ్చే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు.
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనిత, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45406/