ఇంట్లోనే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష..!
November 16, 2026
dharshininews
ఇంట్లోనే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష..!
- ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లే పనిలేదు..
- లెర్నర్స్ లైసెన్స్ కోసం ఏఐ ఆధారిత విధానం
- ముఖ గుర్తింపుతో ఆన్‌లైన్ పరీక్ష
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇకపై రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అందుబాటులోకి రానుంది.
లెర్నర్స్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) పరీక్షను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రాసే వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సారథి పోర్టల్‌లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్రంలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది.
ముఖాన్ని గుర్తిస్తేనే పరీక్షకు అనుమతి
కొత్త విధానంలో అభ్యర్థులు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, వెబ్‌క్యామ్ సహాయంతో పరీక్ష రాయవచ్చు. ముందుగా దరఖాస్తులో సమర్పించిన ఫొటోతో పరీక్ష రాసే వ్యక్తి ముఖాన్ని ఏఐ వ్యవస్థ సరిపోల్చుతుంది. అభ్యర్థి సజీవంగా ఉన్నారో లేదో నిర్ధారించేందుకు ముఖ కదలికలను కూడా పరిశీలిస్తుంది. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాతే పరీక్ష ప్రారంభమవుతుంది.
పరీక్ష మొత్తం ఏఐ నిఘా
పరీక్ష సమయంలో అభ్యర్థి ఒక్కరే కెమెరా ముందు ఉండాలి. మరో వ్యక్తి కెమెరా పరిధిలోకి వచ్చినా, అభ్యర్థి కెమెరా నుంచి తప్పుకున్నా వ్యవస్థ అప్రమత్తమవుతుంది. ఇతర వెబ్‌సైట్లు, విండోలను తెరిచి సమాధానాలు వెతకకుండా సాంకేతిక నియంత్రణలు ఉంటాయి. పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పరీక్ష రద్దయ్యే అవకాశం ఉంటుంది.
పాస్ అయితే మొబైల్‌కే డిజిటల్ లైసెన్స్
పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితం వెల్లడవుతుంది. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిజిటల్ సంతకం, క్యూఆర్ కోడ్‌తో కూడిన లెర్నర్స్ లైసెన్స్ పీడీఎఫ్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాంకేతిక కారణాలతో ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తికాకపోతే ఓటీపీ లేదా బయోమెట్రిక్ విధానంలో ఆర్టీఓ కార్యాలయంలో పరీక్ష రాసే ప్రత్యామ్నాయ అవకాశం కూడా ఉంటుందని సమాచారం.
ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే లెర్నర్స్ లైసెన్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గడంతో పాటు సమయం ఆదా కానుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఉద్యోగులు, విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది.
https://www.dharshininews.com/45400/