schedule Sunday, July 05, 2026

బాలాజీ చిట్స్‌ ఆస్తుల జప్తుకు రంగం సిద్దం

calendar_today May 6, 2023
person dharshininews
బాలాజీ చిట్స్‌ ఆస్తుల జప్తుకు రంగం సిద్దం
బాలాజీ చిట్స్‌ ఆస్తుల జప్తుకు రంగం సిద్దం - త్వరలోనే బాధితులకు న్యాయం - వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని బాలాజీ చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ బాధితులకు ఊరట లభించబోతోంది. చిట్ ఫండ్ ద్వారా బాధితులను మోసం చేసిన యజమానుల ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితె .. తాండూరుకు చెందిన గంగిశెట్టి శ్రీనివాస్, గంగిశెట్టి గోపాల కృష్ణ, అనురాధ, సరితలు గత కొన్ని నెలల క్రితం బాలాజీ చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ ను కొనసాగించారు. ఈ చిట్ ఫండ్ లో దాదాపు 78 మంది నుంచి చీటీల డబ్బులను స్వాహా చేసి మోసం చేసినట్లు గత యేడాది తాండూరు పోలీస్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇందులో నిందితులుగా ఉన్న గంగిశెట్టి శ్రీనివాస్, గంగిశెట్టి గోపాల కృష్ణ, అనురాధ, సరితలపై అప్పట్లో చీటింగ్ కేసు నమోదయ్యింది. ఇందులో మొదటి నిందితుడు ఆయిన గంగిశెట్టి శ్రీనివాస్ ను అప్పట్లోనే రిమాండుకు తరలించారు. అయితే బాలాజీ చిట్ ఫండ్ పై నమోదైన చీటింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు 78 మందితో విచారణ చేపట్టి సాక్ష్యాలను నమోదు చేశారు. అదేవిధంగా నిందితులపై ఉన్న ఆస్తుల వివరాలను కూడ సేకరించారు. వారి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన కోస్టు నిందితుల ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బాలాజీ చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. త్వరలోనే పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ స్పష్ట్యం చేశారు. దీంతో తాండూరు బాలాజీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటేడ్ బాధితులకు ఊరట లభించనుంది. ఇది కూడా చదవండి.. పట్టుదలతో లక్ష్యాలను సాధించుకోవాలి - ఉత్సహాంగా శాలివాహన విద్యార్థుల వీడ్కోలు సమావేశం - ఆడిపాడిన కళాశాల విద్యార్థులు https://dharshininews.com/16935 పట్నం వారి పెళ్లి సందడి..! - వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం - కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ https://dharshininews.com/16923