schedule Saturday, September 12, 2026

రోహిత్ రెడ్డి ఆల్‌ టైం ఎమ్మెల్యే

calendar_today February 21, 2023
person dharshininews
రోహిత్ రెడ్డి ఆల్‌ టైం ఎమ్మెల్యే
రోహిత్ రెడ్డి ఆల్‌ టైం ఎమ్మెల్యే - ఆయనపై నోరు జారడం తగదు - మురళీకృష్ణ గౌడ్‌ విమర్శలు సిగ్గుచేటు - కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వన్‌ టైం ఎమ్మెల్యే కాదు ఆల్‌ టైం ఎమ్మెల్యే అని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ సోమవారం జైలు నుంచి బెయిల్ పై బటయకు వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై వ్యక్తిగత వాఖ్యలు చేయడాన్ని ఆమె ఖండించారు. రోహిత్ రెడ్డి వన్‌ టైం ఎమ్మెల్యే అంటూ చేసిన వాఖ్యలు అర్థరహితమన్నారు. తాండూరు ప్రాంత రూపు రేఖలు మార్పుకోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన చేస్తున్న ప్రగతికి ప్రజలు మళ్లీ.. మళ్లీ పట్టం కడతారని, రోహిత్ రెడ్డి ఆల్‌ టైం ఎమ్మెల్యేగా నిలుస్తారని పేర్కొన్నారు. గతంలో రోహిత్ రెడ్డి వెండి ఉండి కుతంత్రాలు చేయడంతో మురళీకృష్ణ గౌడ్‌ను దూరం పెట్టడం జరిగిందన్నారు. అయినా మురళీకృష్ణ గౌడ్ పద్దతిని మార్చుకోలేదని, శివస్వాముల ఘటనలో రాజకీయం చేయాలని యత్నించినందుకే జైలుకు వెళ్లారని అన్నారు. జైలు నుంచి నచ్చినా కూడ ఎమ్మెల్యేపై నోరుజారి వాఖ్యలు చేయడం పద్ధతి కాదన్నారు. ఇకనైనా నోరు అదుపులో ఉంచుకుని రాజకీయాలు చేసుకోవాలని సూచించారు.