schedule Saturday, September 12, 2026

మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు

calendar_today December 30, 2022
person dharshininews
మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు
మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు - అయ్యప్ప స్వామి వాఖ్యలపై క్షమాపణ చెప్పాలి - బైరీ నరేష్‌ను వెంటనే అరెస్టు చేయాలి - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా వాఖ్యలు చేస్తే సహించేదిలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. కోడంగల్‌లోని రావులపల్లిలో జరిగిన ఓ సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప జననంపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని ప్రభాకర్‌ గౌడ్ ఖండించారు. సమాజంలో అన్ని మతాలు అందరికి సమానమన్నారు. అందరు మతాలను, కులాలను గౌరవించాలన్నారు. అలాంటిది హిందూ దేవుళ్లపై మనోభావాలను దెబ్బతీసేలా వాఖ్యలు చేయడం పద్దతి కాదన్నారు. అయ్యప్ప స్వామి పుట్టుకపై బైరీ నరేష్ అనుచిత వాఖ్యలు చేయడం సహించేలేనిదన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మతపరమైన వాఖ్యలు చేసిన బైరీ రమేష్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేసిన బైరీ నరేష్‌ను అరెస్టు చేసి శించాలని డిమాండ్ చేశారు.