schedule Saturday, September 12, 2026

గుంతల రోడ్డే పడేసింది..!

calendar_today October 20, 2022
person dharshininews
గుంతల రోడ్డే పడేసింది..!
గుంతల రోడ్డే పడేసింది..! - కరణ్ కోట్ మార్గంలో సిమెంట్ ట్యాంకర్ బొల్తా - అప్రత్తతతో తప్పిన ప్రాణాపాయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం కరణ్ కోట్ రోడ్డు పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత వారం రోజులుగా ఎదో ఒక రూపంలో రోడ్డు సమస్య అందరిని తాకుతోంది. భారీ వర్షాల వల్ల రోడ్డుపై అడుగుకు ఒక భారీ గుంతలు ఏర్పడడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జరగానికి జరిగితే ఎవరు బాధ్యత అని అనుకుంటున్న తరుణంలో ఈ మార్గంలో ఓ ప్రమాదం జరిగింది. కరణ్ కోట్ పెన్నా సిమెంట్ కర్మాగారం సమీపంలో ఓ సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది. అదృష్ట వశాత్తు అప్రమత్తం వహించడంతో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనతో కరణ్ కోట్ మార్గం వాహన దారుల్లో ఆందోళన కలిగింది. వెంటనే పాలకులు, అధికారులు స్పందించి గుంతల రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.