schedule Sunday, July 05, 2026

వీఆర్ఏల అరెస్టు..!

calendar_today October 11, 2022
person dharshininews
వీఆర్ఏల అరెస్టు..!
వీఆర్ఏల అరెస్టు..! - పోలీస్టేషన్‌కు తరలించిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండల వీఆర్ఏలను కరణ్ కోట్ పోలీసులు ఆరెస్టు చేశారు. వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తరలివెళ్ల కుండా కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు మండలంలోని వివిధ గ్రామాల వీఆర్ఏలను అరెస్టు చేశారు. అనంతరం వారిని కరణ్ కోట్ పోలీస్టేషన్ కు తరలించి సొంత పూచికత్తుపై వదిలి పెట్టారు. ఆరెస్టు అయిన వారిలో తాండూరు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బోయిని చంద్రప్స, హర్షద్, బాలు, సాయిలు, నర్సమ్మ, విజయలక్ష్మి, ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని, ఆరెస్టులు చేసిన ఉద్యమాన్ని ఆపేది లేదని పేర్కొన్నారు. మ‌రోవైపు వీఆర్ఏలు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం 79 రోజులుగా స‌మ్మెను చేప‌డుతున్నారు.