schedule Sunday, July 05, 2026

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

calendar_today July 6, 2022
person dharshininews
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి - తాండూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్రజలు బ్యాంకు మోసాలు, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తాండూరు పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ సూచించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. ఓటీపీ నెంబర్ వస్తుంది చెప్పండి అని పోన్ చేస్తే ఎలాంటి వివరాలు చెప్పరాదన్నారు. ఓటీపీ నెంబర్లతో బ్యాంకు ఖాతాలలలోని నగదును మాయం చేస్తారని వివరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా బ్యాంకుల‌కు వెళ్లి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా కరోనా కేసులు కలవర పెడుతున్నాయని, కావున ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.