schedule Wednesday, November 18, 2026

పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..!

calendar_today November 18, 2026
person dharshininews
పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..!
పేద కుటుంబంలో ఇంటి కల సాకారం..! - 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన హరి గౌడ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీ హరి గౌడ్‌ అన్నారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డు కోకట్ రోడ్‌ సాయిబాబ మందరం సమీపంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరి గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. నూతన గృహంలో ఆ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సొంతింటి కల సాకారమైన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. https://www.dharshininews.com/45432/