ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు..!
November 18, 2026
dharshininews
ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు..!
- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- రూ.1.40 కోట్లతో తాండూరు సబ్ రిజిస్ట్రార్ నూతన భవనం
- నిర్మాణ పనులకు శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి: రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు కూడా సరైన వసతులు లేక అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రూ.1.40 కోట్ల నిధులతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కలుగుతాయని అన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు, డాక్యుమెంట్ రైటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలు అందేలా నూతన భవనం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్ధుల్ రజాక్, సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డే శ్రీనివాస్, డీసీసీబీ జిల్లా మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అఫ్ఫూ, పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, సాయన్న గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45427/