schedule Wednesday, November 18, 2026

బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..!

calendar_today November 18, 2026
person dharshininews
బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..!
బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ముందస్తు అరెస్టు..! - రాజీవ్ కాలనీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు - పోలీసుల చర్యను అడ్డుకున్న స్థానిక ప్రజలు - వార్డు అభివృద్ధి కోరడం తప్పా? అని ప్రశ్నించిన జావీద్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజీవ్, ఇందిరమ్మ కాలని మున్సిపల్ కౌన్సిలర్ జావీద్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పట్టణ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ జావీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు అక్కడికి చేరుకుని పోలీసుల చర్యను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ.. తన వార్డు అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడటం తప్పా? అని ప్రశ్నించారు. తాను ఎలాంటి ఆందోళన చేయబోనని, వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని మాత్రమే కోరుతున్నానని తెలిపారు. అయితే పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా జావీద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే పర్యటనకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. https://www.dharshininews.com/45423/