పౌష్టికాహారంతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
November 19, 2026
dharshininews
పౌష్టికాహారంతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
- మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
- ఘనంగా ‘అంగన్వాడీకి తొలి ముద్ద’ కార్యక్రమం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులకు పౌష్టికాహారం అందించి, వారి సంపూర్ణ ఎదుగుదలకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు మల్‌రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రం నంబర్-1లో ‘అంగన్వాడీకి తొలి ముద్ద’ కార్యక్రమాన్ని ఆమె స్థానిక వార్డు కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిశ్రమాలను పౌష్టికాహారంగా అందించారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చిన్నారులకు ప్రతిరోజూ రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన అదనపు మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అంగన్ వాడి టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45444/