చిరస్మరణీయురాలు ఇందిరాగాంధీ
November 19, 2026
dharshininews
చిరస్మరణీయురాలు ఇందిరాగాంధీ
- దేశాభివృద్ధికి ఆమె చేసిన సేవలు మరువలేనివి
- మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
- ఇందిరా చౌరస్తాలో ఘనంగా జయంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తాండూరులోని ఇందిరా చౌరస్తాలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45442/