schedule Thursday, November 19, 2026

భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..!

calendar_today November 19, 2026
person dharshininews
భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..!
భవిష్యత్తు తరాలకు బుయ్యని ముందుచూపు..! - తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యేకు అండగా నిలవాలి - పట్టణ మాస్టర్‌ ప్లాన్‌పై రాజకీయాలు తగవు - డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె.గోపాల్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు ముందడుగు వేయడం అభినందనీయమని డీసీసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె.గోపాల్‌ అన్నారు. ఇది కేవలం ఒక నమూనా మాత్రమేనని, ప్రజల నుంచి వచ్చే నిర్మాణాత్మక సూచనల ఆధారంగా అవసరమైన మార్పులు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాండూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేవలం ఐదేళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించే ముందుచూపు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డికి ఉందన్నారు. తాండూరు అభివృద్ధి ఎవరి వ్యక్తిగత ప్రయోజనం కాదని, ఇది పట్టణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. విమర్శలు పక్కనపెట్టి ఎమ్మెల్యేకు అండగా నిలవాలని, తాండూరును అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం ఆయనకు మేధావులు, ప్రజలు, అన్ని వర్గాల వారు అండగా నిలవాలని కోరారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని గోపాల్‌ పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర సంపద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగించబడుతుందని తెలిపారు. తాండూరు అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా నిర్మాణాత్మక సూచనలతో సహకరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/45438/