మాస్టర్ ప్లాన్ వెనుక కుట్ర..!
November 18, 2026
dharshininews
మాస్టర్ ప్లాన్ వెనుక కుట్ర..!
- భూముల స్వరూపం మార్చేందుకు స్కెచ్
- తెరవెనుక ప్రయత్నాలను బహిర్గతం చేయాలి
- బీఆర్ఎస్ కౌన్సిలర్ సురేష్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా అభాసుపాలైందని మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సురేష్ నాయక్ ఆరోపించారు.
బుధవారం ఓ హోటల్‌లో జరిగిన పట్టణ సమగ్ర అభివృద్ధిపై చర్చించాల్సిన సమావేశంలో రియల్ ఎస్టేట్ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. మూడు దశాబ్దాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే మూడుసార్లు మార్చారని, ప్రస్తుతం ఉన్న ప్రణాళికను అమలు చేయడానికి కూడా నిధుల కొరత ఉందని తెలిసినా మళ్లీ చర్చల పేరుతో హడావుడి చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ వంటి కీలక శాఖల అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటన్నారు. మాస్టర్ ప్లాన్ వివరాలను ప్రజలకు పూర్తిగా తెలియజేసి, అభిప్రాయాలు సేకరించాల్సి ఉండగా సంబంధంలేని అంశాలతో సమయం వృథా చేశారని పెదవి విరిచారు. ముఖ్యంగా పాత తాండూరులో పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించిన భూములను నివాస ప్రాంతాలుగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్‌ను అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సురేష్ నాయక్ ఆరోపించారు.
సిండికేట్ ప్రాంతంలోని భూములకు సంబంధించి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ కొందరి భూముల విలువ పెంచేందుకా.. లేక తాండూరు ప్రజల భవిష్యత్తు అభివృద్ధి కోసమా అన్నది స్పష్టం చేయాలని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు.
https://www.dharshininews.com/45436/