schedule Sunday, September 13, 2026

స్త్రీనిధి రుణాల్లో గోల్ మాల్..!

calendar_today July 3, 2022
person dharshininews
స్త్రీనిధి రుణాల్లో గోల్ మాల్..!
స్త్రీనిధి రుణాల్లో గోల్ మాల్..! - ఐనెల్లిలో సామాజిక త‌నిఖిలో వెలుగులోకి - దాదాపు రూ.20లక్షల వరకు అవకతవకలు - వెల్లడించిన స్త్రీనిధి జిల్లా మేనేజర్ వేణు తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండ‌లంలో స్త్రీనిధి రుణాల రికవరీలో భారీగా గోల్ జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. మండ‌లంలోని ఐనెల్లి గ్రామంలో నిర్వ‌హించిన సామాజిక త‌నిఖిలో దాదాపు రూ. 20లక్షల వరకు అవక తవకలు జరిగినట్లు స్ర్తీనిధి జిల్లా మేనేజ‌ర్ వేణు తెలిపారు. ఐనెల్లి గ్రామంలో 38 సంఘాలకు స్త్రీనిధి కింద రూ. 34 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల రికవరీలో గ్రామానికి చెందిన వీవో దాదాపు రూ. 20 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు స్త్రీనిధి జిల్లా మేనేజర్ వేణు తెలిపారు. ఈ విషయం సెర్ఫ్ రాష్ట్ర అధికారులకు తెలియడంతో తనతో పాటు సెర్చ్ స్టేట్ రీపోర్స్ పర్సన్ యాదలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ కేతావత్ సంతోష్, ఐకేపీ ఏపీఎం ఆనంద్ బృందంతో మూడు రోజులుగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. విచారణ పూర్తి అయిన వెంటనే ఏ మేరకు అవినీతి జరిగిందని అనేతి తేలుతుందన్నారు. దీంతో పాటు రుణాలు తీసుకున్నది ఎంత మంది, తిరిగి చెల్లించింది ఎంతమంది అనే తెలుస్తుందని చెప్పారు. అవ‌క‌త‌వ‌క‌లు నిజాలు అని తేలితే వివోపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు.