schedule Tuesday, September 08, 2026

మోడీ, కేసీఆర్ వి దొంగ నాటకాలు

calendar_today April 4, 2022
person dharshininews
మోడీ, కేసీఆర్ వి దొంగ నాటకాలు
మోడీ, కేసీఆర్ వి దొంగ నాటకాలు - పెనుభారాలు మోసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలి: ప్రభాకర్ గౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రధాని మోడి, సీఎం కేసీఆర్లు దొంగనాటకాలు ఆడుతున్నారని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలు పెంచితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ బస్ చార్జీలను పెంచి పేదలపై పెనుభారం మోపాయ‌ని అన్నారు. బీజేపీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన వెంటనే ధరలను అమాంతం పెంచిందన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లలో ప్రతి గింజ కొంటామని చెప్పిన కేసీఆర్ ఆ వ్యవహారాన్ని కేంద్రంపై నెట్టివేశారన్నారు. కేంద్రంపై ఉద్య‌మం పేరుతో మ‌భ్య‌పెడుతున్నార‌ని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగ నాటకాలతో ప్రజలపై పెనుభారం ప‌డి న‌లిగి పోతున్నార‌న్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.