సేవ నుంచి.. ప్రజానాయకత్వం రావాలి..!
November 21, 2026
dharshininews
సేవ నుంచి.. ప్రజానాయకత్వం రావాలి..!
- సమాజంలో శంకర్ యాదవ్ సేవలు అభినందనీయం
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
- అంతర్జాతీయ సేవారత్న పురస్కారంపై బీసీ సంఘం హర్షం, సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందుతున్న తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారవేత్త శంకర్ యాదవ్ భవిష్యత్తులో ప్రజానాయకత్వం వైపు అడుగులు వేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ ఆకాంక్షించారు.
అంతర్జాతీయ సేవారత్న పురస్కారం అందుకున్న శంకర్ యాదవ్ ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యల పరిష్కారానికి విస్తృతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. శంకర్ యాదవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులను గజమాలతో సత్కరించి, శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు.
అనంతరం కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాండూరు ప్రాంత ప్రజలకు శంకర్ యాదవ్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సేవాభావంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ప్రజానాయకుడిగా ఎదిగి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయనకు మరిన్ని అవార్డులు, ఉన్నతమైన గుర్తింపులు రావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, వడ్డెర సంఘం జిల్లా నాయకుడు వడ్డే సత్యనారాయణ, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా విభాగం నాయకులు అనిత, విజయలక్ష్మి, వీరమణి, జగదీశ్వరి, అనిత రమేష్, మండలాల అధ్యక్షులు నరేందర్, లక్ష్మణ్ చారి, బసంత్ కుమార్, మీడియా ఇన్‌ఛార్జి బసవరాజ్, యువ నాయకులు రాము ముదిరాజ్, హరి ప్రసాద్, టైలర్ రమేష్, దుబాయ్ వెంకట్, యాసర్, నరహరి, శ్రీనివాస్, పరమేష్, అజయ్, కిరణ్, విజయ్, చిన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45483/