schedule Saturday, November 21, 2026

ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..!

calendar_today November 21, 2026
person dharshininews
ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..!
ఆయుష్మాన్‌ భారత్‌లో భారీ మార్పులు..! - ఇకనుంచి 112 రకాల చికిత్సలు అందుబాటులో - డిసెంబర్‌ 1 నుంచి కొత్త విధానం అమలుకు కసరత్తు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఆరోగ్య సమస్యలు వస్తే వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో వైద్య చికిత్సల పరిధిని భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 23 చికిత్సలకు అదనంగా మరో 89 వైద్య సేవలను చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మొత్తం చికిత్సల సంఖ్య 112కు చేరనుంది. 89 చికిత్సలు అదనం కొత్తగా ప్రతిపాదించిన 89 ప్యాకేజీల్లో సాధారణ వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన సేవలు ఉన్నాయి. తీవ్రమైన రక్తహీనత, అధిక రక్తపోటు, తీవ్రమైన బ్రాంకైటిస్‌, విరేచనాలు, డిసెంట్రీ, గ్యాస్ట్రో ఎంటరైటిస్‌, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలు, తీవ్రమైన జ్వరాలు, మధుమేహ సంబంధిత సమస్యలకు చికిత్సలు ఇందులో ప్రతిపాదించారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పథకం ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాలు విస్తరించనున్నాయి. డిసెంబర్‌ 1 నుంచే అమలుకు..? కొత్త చికిత్సల జాబితాను డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి, వాటిని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కేంద్రం తుది మార్గదర్శకాలు ఎప్పుడు వెలువరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. https://www.dharshininews.com/45423/