తొమ్మిదేళ్ల కేసుకు తెర..!
November 20, 2026
dharshininews
తొమ్మిదేళ్ల కేసుకు తెర..!
- ఫోక్సో నిందితుడికి 20ఏండ్ల జైలు
- బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం
- తాండూరు పోలీసుల దర్యాప్తుకు ఫలితం
- సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి న్యాయస్థానం గట్టి శిక్ష విధించింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం తాండూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష ఖరారైంది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు.
శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా కేసు వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. 2017లో తాండూరు మండలం గ్రామానికి చెందిన బండమిడి నర్సింలు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. అదే ఏడాది తాండూరు పోలీస్టేషన్‌లో నిందితుడిపై ఐపీసీ, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం వికారాబాద్ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి. ప్రదీప్ నాయక్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో అప్పటి తాండూరు ఎస్‌హెచ్‌ఓ ఎం. వెంకట రామయ్య, అప్పటి డీఎస్పీ ఎం. రామచంద్రుడు దర్యాప్తు చేపట్టగా, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ జి. పరమేశ్వర్ గౌడ్ తదుపరి ప్రక్రియలను సమన్వయం చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెరాజ్ ఫిర్దౌస్ వాదనలు వినిపించగా, భారోసా కేంద్రం తరఫున కీర్తి ఆకుల బాధితురాలికి న్యాయ సహకారం అందించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందించనున్నారు.
తీర్పుపై స్పందించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, భారోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసులో పటిష్టమైన దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు.
https://www.dharshininews.com/45460/