schedule Friday, November 20, 2026

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా..!

calendar_today November 20, 2026
person dharshininews
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా..!
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా..! - రెండు ట్రాక్టర్లు పట్టివేత, ఇద్దరిపై కేసు - యాలాల పోలీస్టేషన్‌ పరిధిలో ఘటన - కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లపై యాలాల పోలీసులు కొరడా జులిపించి.. కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించగా నిర్వహించారు. ఈ క్రమంలో అగ్గనూరు గ్రామానికి చెందిన బంటు నర్సింలు నడుపుతున్న ట్రాక్టర్‌ (TS 34 TB 5088), సంగం కుర్దు గ్రామానికి చెందిన మోత్కూరి రమేష్‌ నడుపుతున్న ట్రాక్టర్‌ (TG 34 B 0610) పట్టుబడ్డాయి. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇద్దరు డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. https://www.dharshininews.com/45457/