schedule Friday, November 20, 2026

అబ్దుల్‌ రవూఫ్‌కు బీఎస్‌ఆర్‌ పరామర్శ

calendar_today November 20, 2026
person dharshininews
అబ్దుల్‌ రవూఫ్‌కు బీఎస్‌ఆర్‌ పరామర్శ
అబ్దుల్‌ రవూఫ్‌కు బీఎస్‌ఆర్‌ పరామర్శ - ఆరోగ్య పరిస్థితిపై ఆరా - నివాసానికి వెళ్ళి భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అబ్దుల్‌ రవూఫ్‌ను ఆర్‌బీఓఎల్‌ సీఈఓ, కాంగ్రెస్‌ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి (బీఎస్‌ఆర్‌) ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను తెలుసుకుని, రవూఫ్‌ వేగంగా కోలుకుంటుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, రాజకీయ రంగంలో తన సేవలను కొనసాగించాలని బీఎస్‌ఆర్‌ ఆకాంక్షించారు. బీఎస్ఆర్ వెంట మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఉన్నారు. https://www.dharshininews.com/45448/