schedule Friday, November 20, 2026

ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి..!

calendar_today November 20, 2026
person dharshininews
ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి..!
ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి..! - హద్దులు దాటితే చర్యలు తప్పవు - కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి. రాజు - తొలి కమిటి సమావేశంలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, ర్యాగింగ్‌ నిరోధక కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బి. రాజు హెచ్చరించారు. శుక్రవారం తాండూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ తొలి సమావేశానికి ముందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బి. రాజు మాట్లాడుతూ.. ర్యాగింగ్‌ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పలు నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, విద్యార్థులను వేధించినా వెంటనే కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉన్నత ఆశయాలతో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిలో మూడో స్థానం సాధించిందని తెలిపారు. తాండూరు రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పద్మమాలిని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రజాక్‌ మాలిక్‌ ఖాన్‌, యాలాల ఎస్సై విఠల్‌రెడ్డి, న్యాయవాది దిలీప్‌ సింగ్‌ ఠాకూర్‌, రాష్ట్ర గ్రామీణ విలేకరుల సంక్షేమ సంఘం సభ్యులు కందనెల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45455/