ఎస్సై అభ్యర్థులకు అలర్ట్..!
November 20, 2026
dharshininews
ఎస్సై అభ్యర్థులకు అలర్ట్..!
- 22 నుంచి హాల్‌టికెట్లు!
- డౌన్‌లోడ్ తేదీ గడువు ఇదే
- రాత పరీక్ష డేట్ ఎప్పుడంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎస్సై, సమాన స్థాయి పోస్టుల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ [www.tgprb.in](https://www.tgprb.in)ను సందర్శించాలి. ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.మొత్తం 275 ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి ఈ నెల 29న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు 1,60,712 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించగా, అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగు, 43.02 శాతం మంది ఇంగ్లిష్, 0.12 శాతం మంది ఉర్దూ మాధ్యమాలను ఎంపిక చేసుకున్నారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
అభ్యర్థులు ముందుగా www.tgprb.in వెబ్‌సైట్‌ను తెరిచి ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. హాల్‌టికెట్‌పై నిర్దేశించిన స్థలంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా అతికించాలి. ఫొటో లేని హాల్‌టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.
పరీక్ష రోజున హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రం చిరునామా, సమయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రపరచుకోవాలని సూచించారు.
https://www.dharshininews.com/45451/