schedule Saturday, November 21, 2026

బీజేపీ సర్పంచుకు జిల్లా అధ్యక్షుడి పరామర్శ

calendar_today November 21, 2026
person dharshininews
బీజేపీ సర్పంచుకు జిల్లా అధ్యక్షుడి పరామర్శ
బీజేపీ సర్పంచుకు జిల్లా అధ్యక్షుడి పరామర్శ - రాజేందర్‌రెడ్డి మాతృమూర్తికి నివాళులర్పించిన యు. రమేష్‌కుమార్‌ - కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం కోకట్‌ గ్రామ సర్పంచ్‌, బీజేపీ నాయకుడు రాజేందర్‌రెడ్డి మాతృమూర్తి శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేష్‌కుమార్‌ కోకట్‌ గ్రామంలోని రాజేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్‌, యాలాల మండల మాజీ అధ్యక్షుడు ఆకుల శివకుమార్‌, సీనియర్‌ నాయకులు బజారప్ప, పాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45475/