మహారుద్రాభిషేకంకు సిద్ధం..!
November 21, 2026
dharshininews
మహారుద్రాభిషేకంకు సిద్ధం..!
- ఎల్లుండి తాండూరు గోశాలలో వేడుక
- కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన శంకర్ యాదవ్ దంపతులు
- భక్తులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
కార్తీక సోమవారం సందర్భంగా గోశాలలో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్ అధినేత శంకర్ యాదవ్ దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం తాండూరులోని శంకర్ యాదవ్ నివాసంలో గోశాల సభ్యులతో కలిసి చంద్రకళ, శంకర్ యాదవ్ దంపతులు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కార్తీక సోమవారం రోజున నిర్వహించే మహారుద్రాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ పరిధిలోని వివిధ ఆలయాల పూజారులను శంకర్ యాదవ్ సన్మానించనున్నారు. ఆలయాల పూజారులు తమ సమాచారంను సాయిపుత్ర సేవా సమితి ప్రతినిధి జొన్నల వినోద్(ఫోన్ నెంబర్ 9949272011)కు తెలియజేయాలని గోశాల నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమంలో గోశాల గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, అధ్యక్షుడు వినోద్‌కుమార్ జైన్, కోశాధికారి పటేల్ విజయ్, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, బాలాజీ వెంకట్, ఎస్. రాము, విష్ణురామ్ చౌదరి, సాయిపుత్ర సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45467/